పంచగ్రామాల ప్రజలను అక్రమాదారులుగా ముద్ర వేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు – ఇది హెచ్చరిక.
*విశాఖపట్నం డిసెంబర్ 16పున్నమి ప్రతినిధి*
సింహాచలం తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు నిర్మించిన BRTS రోడ్డుకు సంబంధించి బాధితులకు TDRలు మంజూరు చేస్తూ G.O జారీ చేసిన కూటమి ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం. ఇందుకు కూటమి ప్రభుత్వానికి పంచగ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
అయితే, అదే కూటమికి చెందిన ఒక కార్పొరేటర్ పంచగ్రామాల్లో నివసించే రైతులు, ప్రజలను చులకన చేసి అక్రమాదారులుగా చిత్రీకరించడం రాజకీయ నీచత్వానికి నిదర్శనం. అప్పటి వైసీపీ ప్రభుత్వం 273 మంది లబ్ధిదారులుగా గుర్తించి, 205 మందికే TDRలు ఇచ్చినట్టు ఇచ్చి, sale option లేకుండా చేశారు. – ఇదే వాస్తవం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారి నాయకత్వంలో BRTS బాధితుల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి, కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ సిఫార్సుల మేరకు 273 మందికీ న్యాయం చేస్తూ G.O జారీ చేయడం జరిగింది.
ఇంత స్పష్టమైన అంశాన్ని తణుకు TDR స్కామ్‌తో పోల్చడం అవివేకం మాత్రమే కాదు, బాధితులపై దాడి చేయడమే.
కూటమిలో అంతర్గత రాజకీయాలుంటే అవి పెద్దల దగ్గర తేల్చుకోవాలి. సింహాచలం BRTS బాధితుల జోలికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు.
ఈ విషయాన్ని పత్రిక సోదరులకు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్పష్టంగా తెలియజేస్తున్నామని
అడవివరం మాజీ సర్పంచ్ – పాశర్ల ప్రసాద్ తెలిపారు.


