ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్) ఛైర్‌పర్సన్ మరియు సభ్యుల నియామకా లకు సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో గురువారంప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో కొనసాగనుంది. ఈ ఎంపిక ప్రక్రియను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారదర్శ కతతో పాటు అర్హతలే ప్రాతిపదికగా ఛైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూల నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.ఎస్.బి.జి. పార్థసారథి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి, అనుభవం కలిగిన అర్హులైన వ్యక్తిని కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియచేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఏపీ బాల హక్కుల కమిషన్ నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీ ఎస్‌సీపీసీఆర్) ఛైర్‌పర్సన్ మరియు సభ్యుల నియామకా లకు సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో గురువారంప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో కొనసాగనుంది. ఈ ఎంపిక ప్రక్రియను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారదర్శ కతతో పాటు అర్హతలే ప్రాతిపదికగా ఛైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.ఎస్.బి.జి. పార్థసారథి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి, అనుభవం కలిగిన అర్హులైన వ్యక్తిని కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియచేపట్టినట్లు అధికారులు తెలిపారు.

