Sunday, 14 December 2025
  • Home  
  • ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం*
- విశాఖపట్నం

ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం*

*ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం* *విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ* *కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు* *విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * నిన్న విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశా రని, ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, నగర శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. వైసీపీ నేతలకు చేతనైతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు.

*ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం*

*విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ*

*కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు*

*విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి *

నిన్న విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశా రని, ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, నగర శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. వైసీపీ నేతలకు చేతనైతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.