ఖమ్మం డిసెంబర్
(పున్నమి ప్రతినిధి):
ఖమ్మం నగరము లోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్ హై టెక్స్ వేదికగా బ్రెయిన్ ఫీడ్ సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆరవ జాతీయ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ టెక్ ఎక్స్పో–2025 పురస్కారాల ప్రధానోత్సవంలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు మూడు జాతీయ పురస్కారాలు దక్కాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు స్కూల్ ఎక్సలెన్సీ అవార్డు, ట్రయిల్ బ్లేజర్ అవార్డు లభించగా, పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యకు బెస్ట్ ఎడ్యుకేషన్ నిస్ట్ అవార్డు వరించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆశిష్ విద్యార్థి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకోవడం విశేషం. ఈ ఘన విజయంతో విద్యా రంగంలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కీర్తి మరింత విస్తరించింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.


