Sunday, 27 September 2026
  • Home  
  • ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ
- విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ

ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి* ఉత్తర నియోజకవర్గంలోని “అందరికీ ఇల్లు” కార్యక్రమం కింద ఒక సెంటు భూమిలో నిర్మించిన ఇళ్లలో ఆప్షన్–3 ప్రకారం పూర్తయిన పాపయ్యపాలెం ప్రాంతానికి చెందిన 49, 50, 51 వార్డుల 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో వన్‌సైట్ ఇళ్ల లబ్ధిదారులు 4,974 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి స్వయంగా ₹35,000 ఖర్చు చేసిన వారికి ప్రభుత్వం అదనంగా సహాయం అందించి, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇళ్లు పొందాలని ఆశించే వారు సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల సంకల్పాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది” అని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారులైన డి.ఈ. ప్రసాద్, ఈ.ఈ. సూరిబాబు, ఏ.ఈ. ప్రభ జోగినాధం, అలాగే బీజేపీ, టిడిపి, జనసేన నేతలు, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, శ్యామల దీపిక, జోనల్ కమిషనర్ రాము, వరప్రసాద్, వాసు, అరుణ్ బాబు, ప్రసాద్, పద్మజ, దిలీప్, బంగారు రాజు, రామకృష్ణ, సుజాత, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తర నియోజకవర్గంలో 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్ పంపిణీ

*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*
ఉత్తర నియోజకవర్గంలోని “అందరికీ ఇల్లు” కార్యక్రమం కింద ఒక సెంటు భూమిలో నిర్మించిన ఇళ్లలో ఆప్షన్–3 ప్రకారం పూర్తయిన పాపయ్యపాలెం ప్రాంతానికి చెందిన 49, 50, 51 వార్డుల 310 మంది లబ్ధిదారులకు పట్టా ప్రొసీడింగ్స్‌ను మంగళవారం పంపిణీ చేశారు.

ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో వన్‌సైట్ ఇళ్ల లబ్ధిదారులు 4,974 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ,
“అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి స్వయంగా ₹35,000 ఖర్చు చేసిన వారికి ప్రభుత్వం అదనంగా సహాయం అందించి, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. ఇళ్లు పొందాలని ఆశించే వారు సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజల సంకల్పాలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది” అని తెలిపారు.

కార్యక్రమంలో హౌసింగ్ శాఖ అధికారులైన డి.ఈ. ప్రసాద్, ఈ.ఈ. సూరిబాబు, ఏ.ఈ. ప్రభ జోగినాధం, అలాగే బీజేపీ, టిడిపి, జనసేన నేతలు, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, శ్యామల దీపిక, జోనల్ కమిషనర్ రాము, వరప్రసాద్, వాసు, అరుణ్ బాబు, ప్రసాద్, పద్మజ, దిలీప్, బంగారు రాజు, రామకృష్ణ, సుజాత, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.