నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రాలకు చేరిన కోటి సంతకాల పత్రాలు …
*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-*
పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “కోటి సంతకాలు” కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా నలుమూలల నుండి సేకరించిన సంతకాల పత్రాలను ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేశారు.
విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో నరసింహా నగర్ పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు 95,500 సంతకాల పత్రాలు తీసుకువచ్చి అందజేయడం జరిగింది.
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త
శ్రీ మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో హెచ్.బి. కొలనీలోని పార్టీ కార్యాలయం నుండి 83,000 సంతకాల పత్రాలు అందజేశారు.
గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ నుండి 65,000 పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్కుమార్ గారి ఆధ్వర్యంలో అశీల్ మెట్ట – ఆశోక్ నగర్ పార్టీ కార్యాలయం నుండి 60,000 పత్రాలు అందజేశారు.
భీమిలి నియోజకవర్గంసమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి ఆధ్వర్యంలో కుమార్తె సిరిసహస్ర(సిరిమ్మ) నిర్వహణలో 60,000 పత్రాలు అందజేశారు.
విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మళ్ల విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి 52,000 పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ కె కె రాజు గారు మాట్లాడుతూ మా నాయకుడు గౌరవ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటేకరణకి వ్యతిరేకంగా విశాఖ జిల్లా లో చేపట్టిన సంతకాల సేకరణకు , ప్రజలు, విద్యార్థులు,మేధావుల నుండి అనూహ్య స్పందన లభించిందని అన్నారు..
జిల్లాలో ఎక్కడ సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టిన స్వచ్ఛందంగా ప్రజల తరలివచ్చి ప్రభుత్వం డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ కరణ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారని , కూటమి ప్రభుత్వంపై ఇంతా తక్కువ కాలం లో ప్రజల నుండి వ్యతిరేకత ఎంత ఉందో తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు..
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటేకరణకి వ్యతిరేకంగా విశాఖ జిల్లా లో ప్రజలు, మేధావులు విద్యార్థులు నుండి ఇంత పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించిన నియోజకవర్గ సమన్వయ కర్తలకు ,మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు , కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు, జిల్లా, నియోజకవర్గాల అనుబంధ సంఘల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు ,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమలో మాజీ శాసన సభ్యులు తైనాలవిజయ కుమార్ ,చింతలపూడి వెంకట రామయ్య, నియోజక పరిశిలకులు, చింతకాయల సన్యాసి పాత్రుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కోలా గురువులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గోలగాని హరి వేంకట కుమారి (మాజీ మేయర్) , బాణాల శ్రీనివాసరావు (ఫ్లోర్ లీడర్) డా. సిఎంఏ జహీర్ అహ్మద్ , పిన్నమరాజు సతీష్ , రాష్ట్ర పార్టీ అధికారిక ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లావరపు జాన్ వెస్లీ , పెర్లా విజయ్ చందర్ , రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణం రాజు శ్రీ వాత్సవ్ , జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నడింపల్లి కృష్ణరాజు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు శంకర్ రావు బాకి శ్యామ్ కుమార్ రెడ్డి , జిల్లా పార్టీ కోశాధికారి కటారి అనిల్ కుమార్ రాజు , జిల్లా పార్టీ అధికారిక ప్రతినిధిలు పల్లా దుర్గారావు , దొడ్డి రామనాధ్ , బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) , జోనల్ అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి నాగ వినాయక శైలేష్ , ముట్టి సునీల్ కుమార్ జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు , పెడాడ రమణి కుమారి , బొని శివ రామకృష్ణ , బర్కత్ అలీ , కర్రి రామ రెడ్డి , శ్రీదేవి వర్మ పినంత్స , సకలభక్తుల ప్రసాద్ రావు , దేవరకొండ మార్కండేయులు , బొండ ఉమా మహేశ్వరరావు , జీలకర్ర నాగేంద్ర , మెరువు గణేష్ , కార్పొరేటర్లు, ZPTC, MPP, మండలం , వార్డు అధ్యక్షులు , రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు వార్డు కమిటి మరియు అనుబంధ కమిటీలు , పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.


