Thursday, 12 February 2026
  • Home  
  • రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు
- అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు

-ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ నుండి ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డు – మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డాక్టర్ ప్రేమలతకు ప్రదానం చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. -విజయవాడలో అవార్డు ప్రదానం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం చేతుల మీదుగా కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత అవార్డును స్వీకరించారు.లెర్నింగ్ మాడ్యూల్ పై బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఐఈసీ యాక్టింగ్’ క్రింద ఈ అవార్డు కళాశాలకు దక్కింది. -ప్రిన్సిపాల్ హర్షం ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తమ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి నిరంతరం కృషి చేసిన కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత గారిని, ఆమె కష్టపడి ప్రతి కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని కొనియాడారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు సైతం డాక్టర్ ప్రేమలతను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దాసరి మోషే, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కెమిస్ట్రీ లెక్చరర్ కె.పి. కృష్ణమూర్తి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

-ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ నుండి ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డు – మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డాక్టర్ ప్రేమలతకు ప్రదానం

చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి

రైల్వే కోడూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

-విజయవాడలో అవార్డు ప్రదానం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం చేతుల మీదుగా కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత అవార్డును స్వీకరించారు.లెర్నింగ్ మాడ్యూల్ పై బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఐఈసీ యాక్టింగ్’ క్రింద ఈ అవార్డు కళాశాలకు దక్కింది.

-ప్రిన్సిపాల్ హర్షం

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తమ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి నిరంతరం కృషి చేసిన కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత గారిని, ఆమె కష్టపడి ప్రతి కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని కొనియాడారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు సైతం డాక్టర్ ప్రేమలతను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దాసరి మోషే, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కెమిస్ట్రీ లెక్చరర్ కె.పి. కృష్ణమూర్తి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.