రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ (గురువారం) మధ్యాహ్నం 1:30 గంటలకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు రాజంపేట జిల్లా కేంద్ర సాధన జేఏసీ ప్రకటించింది. స్థానిక పాత బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగనుంది.
చిట్వేలి మండల వాసులకు పిలుపు:
ఈ చారిత్రక పోరాటంలో చిట్వేలి మండలం నుంచి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చిట్వేలి జేఏసీ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా, మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువత, మేధావులు, విద్యావంతులు మరియు వ్యాపారస్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మద్దతును తెలియజేయాలని కోరింది.
చేయి చేయి కలుపుదాం:
”సోదరులారా రండి, తరలిరండి! చేయి చేయి కలుపుదాం, మన భవిష్యత్తు కోసం పోరాడుదాం” అంటూ జేఏసీ నాయకులు ఉద్ఘాటించారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించడం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, ఇది ఈ ప్రాంత ప్రజలందరి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయమని వారు స్పష్టం చేశారు.
జై చిట్వేల్ జే.ఏ.సీ.


