తెనాలి, గుంటూరు జిల్లా — నవంబర్ (పున్నమి ప్రతినిధి)
తెనాలి పట్టణంతో తనకు ఉన్న అనుబంధం జీవితాంతం మరువలేనిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా తెనాలిలో జరిగిన పలు సమావేశాలు, ఇక్కడి ప్రజలతో ఉన్న ఆప్యాయత తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగించిందని అన్నారు. పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన, మాజీ మంత్రి ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావును మర్యాదపూర్వకంగా కలిశారు. 1980 నుంచి తెనాలిలో జర్నలిస్టుగా, తెలుగు పండిట్‌గా పనిచేసిన కాలాన్ని నిమ్మరాజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు వెంకయ్య నాయుడిని కలుసుకున్నారు.


