ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా IAB మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు, ప్రజాప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి IAS గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా యిరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
రాజమండ్రిలో జరిగిన మీటింగులో MLA నల్లమిల్లి మాట్లాడుతూ…
ఆయకట్టు ధవళేశ్వరంలో మొదలై అటు కాకినాడలో గానీ ఇటు కోనసీమలో గానీ ముగుస్తున్న తరుణంలో ఆ రెండు జిల్లాలకు చెందిన యంత్రాంగం లేకుండా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా అధికారులతో మాత్రమే సమావేశం కావడం వల్ల ఉపయోగం ఉండదు
గోదావరి డెల్టా విడిపోయిన 3 జిల్లాలకు ఇంటర్ లింక్ కావడం చేత మూడు జిల్లా అధికారులతో కలసి ఒకటే మీటింగ్ పెట్టడం వలన సమస్యల పరిష్కారం సులభంగా ఉంటుంది
గతంలో గోదావరి డెల్టా అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కలిపి మీటింగ్ జరిపేవారు, అప్పుడు ఒక డెసిషన్ తీసుకునేవారు కానీ ఇపుడు ఇలా విడిగా పెట్టడం వలన ఫలవంతమైన డిస్కషన్లు జరుగవు
MLA నల్లమిల్లి వాదనను సమర్ధిస్తూ మూడు జిల్లాలకు సరైన కోఆర్డినేషన్ జరుగకపోతే విడి మీటింగ్ ల వలన ఉపయోగం ఉండదని MP పురంధేశ్వరి గారు సమావేశంలో అధికారులను ఉద్దేశ్యించి అన్నారు.
ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం అని ఏలూరు అని ఇస్తున్నారు, ఈస్ట్రన్ సర్కిల్ అంటే కంబైన్డ్ గోదావరి జిల్లాలు, ఇది సరైన విధానం కాదు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా IAB మీటింగ్ పెడితే గోదావరి డెల్టాకి సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రైతులు, ప్రజాప్రతినిధులు తెలియచేయడం జరుగుతుందన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
గత ప్రభుత్వం హయాంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు, గేట్స్ రిపేర్స్ కి నిమిత్తం వరల్డ్ బ్యాంక్ 200కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నా పట్టించుకోక పోవడంతో మొత్తం 175 గేట్లకు గాను 115 గేట్లు పాడైపోయి బ్యారేజ్ ప్రమాదకర స్థితికి వెళ్లిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 150 కోట్లు మంజూరు చేసి కాటన్ బ్యారేజ్ ను ప్రమాదకర పరిస్థితి నుండి కాపాడినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, యిరిగేషన్ మినిస్టర్, జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టాలి.
సభ్యులoదరూ తీర్మానానికి ఆమోదం తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు, కొవ్వూరు శాసనసభ్యులు శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శ్రీ మేఘా స్వరూప్ IAS రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్ డి వో లు, DC చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


