‘
-రైతుల అభివృద్ధికి పంచ సూత్రాలను వివరించనున్న వీఏఏ, వీహెచ్ఏలు
చిట్వేల్, నవంబర్ 25: పున్నమి ప్రతినిధి
రాష్ట్ర రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం ప్రారంభమైంది. వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో రైతులకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.నవంబర్ 24, 2025 తేదీ నుంచి నవంబర్ 29, 2025 వరకు ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వీఏఏలు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్) మరియు వీహెచ్ఏలు (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్)వారి పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రైతులతో సమావేశం అవుతారు.
-ముఖ్యమంత్రి పంచ సూత్రాలు:
ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధికి సూచించిన పంచ సూత్రాలను’ గురించి క్షుణ్ణంగా వివరిస్తారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు, సాంకేతిక సహకారం, మెరుగైన దిగుబడుల కోసం పాటించాల్సిన పద్ధతులు తదితర అంశాలను తెలియజేస్తారు.రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు కోరారు.


