Monday, 8 December 2025
  • Home  
  • దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*… * *పనిచేసే వారికే ప్రాధాన్యత*
- విశాఖపట్నం

దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*… * *పనిచేసే వారికే ప్రాధాన్యత*

*దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*… * *పనిచేసే వారికే ప్రాధాన్యత* * *వార్డు అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొంటున్న వాసుపల్లి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* దక్షిణ నియోజకవర్గంలో 14 వార్డులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆదేశాల మేరకు బూత్, వార్డు, అనుబంధ కమిటీ ల నియామకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు వార్డులలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి పనిచేసే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ నియామకాల నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం 31 వార్డ్ బాపుఆనంద్, 42వ వార్డు అధ్యక్షుడు బిశెట్టి ప్రసాద్ లతో ఆయా కార్యాలయాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నియామకాలు సిద్ధం చేసిన బిశెట్టి ప్రసాద్ వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కమిటీ నియామకాల్లో కష్టపడే వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి, మళ్లీ అధికారంలో తీసుకువచ్చేందుకు సంస్థాగతంగా బలపడాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు వైసిపి కైవసం చేసుకోనున్నదని వాసుపల్లి గణేష్ కుమార్ జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం పై ఇప్పటికే ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ దొడ్డి రామానంద్, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,31 వ వార్డు, 42వ వార్డు ల సీనియర్ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*…

* *పనిచేసే వారికే ప్రాధాన్యత*

* *వార్డు అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొంటున్న వాసుపల్లి*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
దక్షిణ నియోజకవర్గంలో 14 వార్డులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆదేశాల మేరకు బూత్, వార్డు, అనుబంధ కమిటీ ల నియామకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు వార్డులలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి పనిచేసే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ నియామకాల నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం 31 వార్డ్ బాపుఆనంద్, 42వ వార్డు అధ్యక్షుడు బిశెట్టి ప్రసాద్ లతో ఆయా కార్యాలయాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నియామకాలు సిద్ధం చేసిన బిశెట్టి ప్రసాద్ వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కమిటీ నియామకాల్లో కష్టపడే వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి, మళ్లీ అధికారంలో తీసుకువచ్చేందుకు సంస్థాగతంగా బలపడాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు వైసిపి కైవసం చేసుకోనున్నదని వాసుపల్లి గణేష్ కుమార్ జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం పై ఇప్పటికే ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ దొడ్డి రామానంద్, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,31 వ వార్డు, 42వ వార్డు ల సీనియర్ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.