జగన్రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిశ్రమలు, ఊపిరి పీల్చుకోలేని హీరూ ఫ్యూచర్స్, రెన్యూ,ఎబిసి లాంటి కంపెనీలను తిరిగి రాష్ట్రంలో స్థిరపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకం అవుతున్నాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక
కార్యాచరణను చేపట్టింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి
మాట్లాడుతూ గత 17 నెలలలోనే 20 ఇండస్ట్రియల్ పాలసీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత ఏ
స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది అని.పరిశ్రమల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందినీ.సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని.రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం,వేగవంతమైన పారదర్శక పరిపాలన,ఆన్లైన్ సేవల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేస్తూ,ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు.
రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు రాష్ట్ర యువతకు లభించే అవకాశం ఉందని.ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడుల కోసం ముందుకు వస్తుండటం ఎంతో సంతోషకరం అని పేర్కొన్నారు.
పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు,పారదర్శక విధానాలు,శాంతి భద్రతలు, నైపుణ్య శిక్షణ ఇవన్నీ సమగ్రంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇండస్ట్రీస్ హబ్ గా నిలుస్తుందినీ.పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల వరకు ఆర్థిక లావాదేవీలు,జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని అన్నారు.ప్రభుత్వం తీసుకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్,టెక్నాలజీ, ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు ముందుకు రావాలి” అని సూచించారు.

చంద్రబాబు పరిశ్రమల దిశలో దూకుడు – రాష్ట్రానికి గ్లోబల్ గుర్తింపు లక్ష్యం :- మేడా
జగన్రెడ్డి ప్రభుత్వ విధానాల వల్ల భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిశ్రమలు, ఊపిరి పీల్చుకోలేని హీరూ ఫ్యూచర్స్, రెన్యూ,ఎబిసి లాంటి కంపెనీలను తిరిగి రాష్ట్రంలో స్థిరపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి ఎంతో కీలకం అవుతున్నాయని నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 17 నెలలలోనే 20 ఇండస్ట్రియల్ పాలసీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది అని.పరిశ్రమల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందినీ.సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి అని.రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం,వేగవంతమైన పారదర్శక పరిపాలన,ఆన్లైన్ సేవల ఆధారిత వ్యవస్థను బలోపేతం చేస్తూ,ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు రాష్ట్ర యువతకు లభించే అవకాశం ఉందని.ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడుల కోసం ముందుకు వస్తుండటం ఎంతో సంతోషకరం అని పేర్కొన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు,పారదర్శక విధానాలు,శాంతి భద్రతలు, నైపుణ్య శిక్షణ ఇవన్నీ సమగ్రంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఇండస్ట్రీస్ హబ్ గా నిలుస్తుందినీ.పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగాలు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల వరకు ఆర్థిక లావాదేవీలు,జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని అన్నారు.ప్రభుత్వం తీసుకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్కిల్ డెవలప్మెంట్,టెక్నాలజీ, ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు ముందుకు రావాలి” అని సూచించారు.

