*నవంబర్ 25,26,27 తేదీలలో ఏ.యు స్టూడెంట్స్ ఫెస్ట్.*
*పోస్టర్ ఆవిష్కరణ చేసిన యూనివర్సిటీ వీసి ప్రొఫెసర్ జి.పి రాజశేఖర్ గారు.*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25,26,27 తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఏ.యు స్టూడెంట్స్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్ట్ ప్రధానంగా విశ్వవిద్యాలయం శతాబ్ది సందర్భంగా పురస్కరించుకొని *సాంస్కృతిక కళా ప్రదర్శనలు* నిర్వహించబడుతున్నాయి.
సాంస్కృతిక ఉత్సవాల ఈ కార్యక్రమంల నిర్వహణ పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జి.పి. రాజశేఖర్ గారు, రిజిస్టర్ ప్రొ. కె.రాంబాబు గారు మరియు రెక్టర్ ప్రొ. పి.కింగ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి మాట్లాడుతూ“విద్యార్థులు విద్యా రంగంలో మాత్రమే కాకుండా సాంస్కృతిక రంగంలోనూ తమ ప్రతిభను చూపించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను విద్యార్థులందరూ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్. ఎఫ్. ఐ నిర్వహించే యూనివర్సిటీ ఫెస్ట్ లో విద్యార్థులందరూ పాల్గొని ప్రదర్శించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, కొత్త కొత్త ఆవిష్కరణలు ఇలా అన్ని రంగాల్లోని ముందంజలో ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి డి. వెంకటరమణ మాట్లాడుతూ ఎస్.ఎఫ్. ఐ ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహిస్తుందని. ఈ సంవత్సరం కూడా యధావిధిగా మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఫెస్ట్ లో విద్యార్థులందరూ పాల్గొని అనేక ప్రదర్శనలు ప్రదర్శించాలని కోరారు. గూగుల్ ఫామ్స్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే 9989789035, 8374293138 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షురాలు ఎం కుసుమాంజలి, జిల్లా అధ్యక్షులు జి అజయ్, సంజయ, హర్షిత్, ప్రగతి,నిఖిల్ మానస,సునీల్ మరియు యూనివర్సిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులందరినీ ఈ సాంస్కృతిక ఉత్సవంలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించమని ఆహ్వానించారు


