Thursday, 2 April 2026
  • Home  
  • చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం*
- విశాఖపట్నం

చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం*

*14, 15 తేదీల్లో జరగబోయే CII సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదిక* *చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం* *2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది* *–రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి :* ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడుల కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదికగా నిలవనుంది. పెట్టుబడుల ప్రవాహం, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమల పునరుజ్జీవనం ఇవన్నీ చంద్రబాబు గారు విజన్, లోకేష్ గారి కృషి తోనే సాధ్యమవుతున్నాయి అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. *చంద్రబాబు దూరదృష్టి – లోకేష్ కృషితో పెట్టుబడుల వర్షం* 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు గారి పాలనలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించింది. అదే అభివృద్ధి శకం మళ్లీ ప్రారంభమైంది. కేవలం 17 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో దేశానికి చూపించిన ఉదాహరణ అని ఆయన అన్నారు. మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఆయన శ్రమ, వ్యూహం వల్లే గూగుల్, టీసీఎస్, టాటా, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్నాయి అని పల్లా గారు వివరించారు. *2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది* ఈ వేగంతో అభివృద్ధి కొనసాగితే 2047 నాటికి విశాఖపట్నం భారతదేశంలోనే మొదటి స్థానం లో నిలుస్తుంది. ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, తయారీ రంగాల్లో విశాఖపట్నం ప్రపంచానికి కేంద్రంగా నిలవనుంది. ఇది చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి కృషి ఫలితం అని పల్లా గారు అన్నారు. గూగుల్ రూ.87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్. గతంలో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్కు తెచ్చిన చంద్రబాబు గారు ఇప్పుడు విశాఖను భారతదేశ ‘డిజిటల్ హబ్’గా తీర్చిదిద్దుతున్నారు. ‘సైబరాబాద్’ తర్వాత ఇది ‘సైబర్ విశాఖ’ శకం!” అని ఆయన అన్నారు. *పెట్టుబడిదారులను బెదిరించి, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం లో వైఎస్సార్సీపీ ముఠా* వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం నుంచి దాదాపు ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి. పరిశ్రమలపై వేధింపులు, అధిక పన్నులు, రాజకీయ జోక్యాల వల్ల పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఐదేళ్లలో ఒక్క కొత్త కంపెనీని కూడా రప్పించలేకపోయిన వారు, ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే కంపెనీలకు బెదిరింపు ఇమెయిల్లు పంపుతూ భయపెడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి భరించలేక పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేస్తూ, వాటిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ దుష్టశక్తుల చర్యలను రాష్ట్ర ప్రజలే గట్టిగా తిప్పికొడతారు అని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. *కూటమి పాలనతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జోరు* ఉత్తరాంధ్రను మళ్లీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెడికల్ డివైస్ పార్క్, ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తోంది. ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో విస్తరణ చేపడుతోంది. గూగుల్, టాటా, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయి అని ఆయన వివరించారు. చంద్రబాబు గారి దూరదృష్టి వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రపంచ పెట్టుబడుల దృష్టిలో నిలిచింది. లోకేష్ గారి కృషి వల్ల యువతకు కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. స్థిరమైన పాలన, పారదర్శకత, సాంకేతికత ఆధారంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించింది అని ఆయన అన్నారు.

*14, 15 తేదీల్లో జరగబోయే CII సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదిక*
*చంద్రబాబు–లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కొత్త శకం ప్రారంభం*
*2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది*
*–రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*

*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి :* ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడుల కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ఆర్థిక దిశను మార్చబోతున్న చారిత్రాత్మక వేదికగా నిలవనుంది. పెట్టుబడుల ప్రవాహం, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమల పునరుజ్జీవనం ఇవన్నీ చంద్రబాబు గారు విజన్, లోకేష్ గారి కృషి తోనే సాధ్యమవుతున్నాయి అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు.

*చంద్రబాబు దూరదృష్టి – లోకేష్ కృషితో పెట్టుబడుల వర్షం*

2014–19 మధ్య కాలంలో చంద్రబాబు గారి పాలనలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 5 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించింది. అదే అభివృద్ధి శకం మళ్లీ ప్రారంభమైంది. కేవలం 17 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో దేశానికి చూపించిన ఉదాహరణ అని ఆయన అన్నారు. మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఆయన శ్రమ, వ్యూహం వల్లే గూగుల్, టీసీఎస్, టాటా, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్నాయి అని పల్లా గారు వివరించారు.

*2047 నాటికి విశాఖపట్నం – భారతదేశంలో నంబర్ వన్ ఐటీ హబ్‌గా అవతరించనుంది*

ఈ వేగంతో అభివృద్ధి కొనసాగితే 2047 నాటికి విశాఖపట్నం భారతదేశంలోనే మొదటి స్థానం లో నిలుస్తుంది. ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, తయారీ రంగాల్లో విశాఖపట్నం ప్రపంచానికి కేంద్రంగా నిలవనుంది. ఇది చంద్రబాబు గారి విజన్, లోకేష్ గారి కృషి ఫలితం అని పల్లా గారు అన్నారు. గూగుల్ రూ.87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు – ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గేమ్ ఛేంజర్. గతంలో మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్కు తెచ్చిన చంద్రబాబు గారు ఇప్పుడు విశాఖను భారతదేశ ‘డిజిటల్ హబ్’గా తీర్చిదిద్దుతున్నారు. ‘సైబరాబాద్’ తర్వాత ఇది ‘సైబర్ విశాఖ’ శకం!” అని ఆయన అన్నారు.

*పెట్టుబడిదారులను బెదిరించి, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం లో వైఎస్సార్సీపీ ముఠా*

వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం నుంచి దాదాపు ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి. పరిశ్రమలపై వేధింపులు, అధిక పన్నులు, రాజకీయ జోక్యాల వల్ల పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఐదేళ్లలో ఒక్క కొత్త కంపెనీని కూడా రప్పించలేకపోయిన వారు, ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే కంపెనీలకు బెదిరింపు ఇమెయిల్లు పంపుతూ భయపెడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి భరించలేక పెట్టుబడులపై తప్పుడు ప్రచారం చేస్తూ, వాటిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ దుష్టశక్తుల చర్యలను రాష్ట్ర ప్రజలే గట్టిగా తిప్పికొడతారు అని పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు.

*కూటమి పాలనతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జోరు*

ఉత్తరాంధ్రను మళ్లీ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మెడికల్ డివైస్ పార్క్, ట్రైబల్ యూనివర్సిటీ, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయి. టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు కల్పిస్తోంది. ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో విస్తరణ చేపడుతోంది. గూగుల్, టాటా, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఇప్పటికే విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయి అని ఆయన వివరించారు.

చంద్రబాబు గారి దూరదృష్టి వల్ల ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రపంచ పెట్టుబడుల దృష్టిలో నిలిచింది. లోకేష్ గారి కృషి వల్ల యువతకు కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. స్థిరమైన పాలన, పారదర్శకత, సాంకేతికత ఆధారంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించింది అని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.