భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను నంద్యాల ఎస్పీజీ మైదానంలో నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సభా ప్రారంభంలో వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు, అతిధులు, విద్యార్థులు సామూహికంగా వందేమాతర గీతం ఆలాపించారు.
హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో నంద్యాల డయాసిస్ బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న కుమార్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు మాట్లాడుతూ భారత హాకీ 1925లో ప్రారంభించబడిందని ఈరోజుతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు హాకీ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, భారత స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో 550 జిల్లాలలో 1000 హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని నంద్యాలలో కూడా నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బిషప్ సంతోష్ ప్రసన్న మాట్లాడుతూ రెండు చరితాత్మక సంఘటనలను నిర్వహించుకుంటున్నామని, జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి వందేమాతర గీతం పాడడం,జాతీయ క్రీడ అయిన హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచ హాకీ చరిత్రలో భారత హాకీ సువర్ణ అధ్యాయం లిఖించిందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ భారతదేశం ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. క్రీడలకు,ఇతర సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భారత హాకీ 1928,1932,1936 వరసగా మూడు పర్యాయాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు, మొత్తం ఎనిమిది ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుందన్నారు. 1975 తర్వాత సాధారణ మైదానాల స్థానంలో ఆస్ట్రో టర్ఫ్ మైదానాలు ప్రపంచ హాకీలో రావడంతో భారత హాకీ కొంత వెనుకకు వెళ్లడం జరిగిందని,ఈ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రానున్న ఒలింపిక్స్ లో భారత హాకీ తిరిగి స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని ఆకాంక్షించారు.
అటవీశాఖ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు.

*నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు*
భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను నంద్యాల ఎస్పీజీ మైదానంలో నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభా ప్రారంభంలో వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు, అతిధులు, విద్యార్థులు సామూహికంగా వందేమాతర గీతం ఆలాపించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో నంద్యాల డయాసిస్ బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న కుమార్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు మాట్లాడుతూ భారత హాకీ 1925లో ప్రారంభించబడిందని ఈరోజుతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు హాకీ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, భారత స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో 550 జిల్లాలలో 1000 హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని నంద్యాలలో కూడా నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిషప్ సంతోష్ ప్రసన్న మాట్లాడుతూ రెండు చరితాత్మక సంఘటనలను నిర్వహించుకుంటున్నామని, జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి వందేమాతర గీతం పాడడం,జాతీయ క్రీడ అయిన హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచ హాకీ చరిత్రలో భారత హాకీ సువర్ణ అధ్యాయం లిఖించిందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ భారతదేశం ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. క్రీడలకు,ఇతర సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భారత హాకీ 1928,1932,1936 వరసగా మూడు పర్యాయాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు, మొత్తం ఎనిమిది ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుందన్నారు. 1975 తర్వాత సాధారణ మైదానాల స్థానంలో ఆస్ట్రో టర్ఫ్ మైదానాలు ప్రపంచ హాకీలో రావడంతో భారత హాకీ కొంత వెనుకకు వెళ్లడం జరిగిందని,ఈ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రానున్న ఒలింపిక్స్ లో భారత హాకీ తిరిగి స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని ఆకాంక్షించారు. అటవీశాఖ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు.

