Saturday, 16 May 2026
  • Home  
  • రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే ప్రత్యేక శిబిరాల నిర్వహణ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
- అన్నమయ్య

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే ప్రత్యేక శిబిరాల నిర్వహణ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం జిల్లాలోని నందలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరగగా.ఇందులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మూడు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.జిల్లాలో ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ కు అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.జిల్లా వ్యాప్తంగా రాజంపేట,మదనపల్లి, రాయచోటి మూడు డివిజన్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై స్పష్టత సాధించడం మరియు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వినడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమంపై దృష్టి సారించి, ప్రతి శాఖ విభాగాధికారికి ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, ఖచ్చితత్వం, మరియు పారదర్శకతను పాటించే విధంగా చూడాలని సూచించారు.

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం జిల్లాలోని నందలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరగగా.ఇందులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మూడు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.జిల్లాలో ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ కు అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.జిల్లా వ్యాప్తంగా రాజంపేట,మదనపల్లి, రాయచోటి మూడు డివిజన్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై స్పష్టత సాధించడం మరియు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వినడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమంపై దృష్టి సారించి, ప్రతి శాఖ విభాగాధికారికి ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, ఖచ్చితత్వం, మరియు పారదర్శకతను పాటించే విధంగా చూడాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.