Friday, 15 May 2026
  • Home  
  • భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
- విశాఖపట్నం

భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు రామస్వామి, జె అయోధ్యరామ్ ఆంధ్ర రాష్ట్ర జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని కోరారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ భద్రత పై విచారణకు మరియు సందర్శన నిమిత్తం విచ్చేసిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం సమావేశ మందిరంలో కలసి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న భద్రతా లోపాలపై చర్చించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఈ కాలంలో ప్లాంట్ లో ఎనిమిది ఫ్యాకల్ యాక్సిడెంట్లు జరిగాయని ఆయన అన్నారు. ప్రధానంగా ప్లాంట్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నందువల్ల అత్యంత వేగంగా తుప్పుపడతాయని దీని నివారణకు తుప్పు పట్టిన ప్రదేశాన్ని తొలగించి మరియు ఆ స్థానంలో కొత్త వాటిని అమర్చి వాటిపై పెయింటింగ్ చేయడం అత్యంత ప్రధానమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కానీ నేడు స్టీల్ యాజమాన్యం పెయింటింగ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ లేడని వాటిపై దృష్టి సారించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. సరియైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరగడం అత్యంత త్వరితగతిన జరుగుతుందని ఆయన వివరించారు. అందుకే కార్మికుల విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరు మా యాజమాన్యంతో చర్చించిన సమయంలో ప్లాంట్ లోని పరికరాలను మరియు కార్మికుల ప్రాణాలకు విలువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ నేడు యాజమాన్యం తీసుకుంటున్న చర్యల వల్ల కార్మికుల సంఖ్య నానాటికి తగ్గుతోందని ఆయన వివరించారు. కార్మికులను ఒక విభాగం నుంచి వేరొక విభాగంలోనికి మార్చిన సందర్భంలో పని భద్రతపై తగిన అవగాహనను కలిగించవలసిన యాజమాన్యం దాన్ని విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గడం వల్ల ఎస్ఎంఎస్ లో కార్మికుల మృతికి కారణమని ఆయన వివరించారు. డిప్లయ్మెంట్ చేస్తున్న కార్మికులకు కనీస భద్రత కల్పించే విధంగా మా యాజమాన్యాన్ని మీరు ఆదేశించాలని ఆయన్ని కోరారు. దీనికి స్పందించిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న మూడు రోజులు మేము కర్మాగారంలో భద్రతపై పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఆ సమయంలో మీరు ఈ విషయాలను మా దృష్టికి తీసుకురావాలని వాటిని మా అధికారులు నోట్ చేసుకునే విధంగా మీరు వివరించండి అని ఆయన అన్నారు. సందర్శన సమయంలో మీరు చెప్పే భద్రతా లోపాలను మరియు మీరు మా దృష్టికి తీసుకువచ్చిన లోపాలను సమన్వయపరిచి మీ యాజమాన్యానికి తగిన సూచనలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, బి ఎన్ మధుసూదన్, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, వి ప్రసాద్, ఎం.వి రమణ, వి డి వి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు రామస్వామి, జె అయోధ్యరామ్ ఆంధ్ర రాష్ట్ర జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని కోరారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ భద్రత పై విచారణకు మరియు సందర్శన నిమిత్తం విచ్చేసిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం సమావేశ మందిరంలో కలసి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న భద్రతా లోపాలపై చర్చించి అనంతరం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఈ కాలంలో ప్లాంట్ లో ఎనిమిది ఫ్యాకల్ యాక్సిడెంట్లు జరిగాయని ఆయన అన్నారు. ప్రధానంగా ప్లాంట్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నందువల్ల అత్యంత వేగంగా తుప్పుపడతాయని దీని నివారణకు తుప్పు పట్టిన ప్రదేశాన్ని తొలగించి మరియు ఆ స్థానంలో కొత్త వాటిని అమర్చి వాటిపై పెయింటింగ్ చేయడం అత్యంత ప్రధానమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కానీ నేడు స్టీల్ యాజమాన్యం పెయింటింగ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ లేడని వాటిపై దృష్టి సారించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. సరియైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరగడం అత్యంత త్వరితగతిన జరుగుతుందని ఆయన వివరించారు. అందుకే కార్మికుల విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరు మా యాజమాన్యంతో చర్చించిన సమయంలో ప్లాంట్ లోని పరికరాలను మరియు కార్మికుల ప్రాణాలకు విలువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ నేడు యాజమాన్యం తీసుకుంటున్న చర్యల వల్ల కార్మికుల సంఖ్య నానాటికి తగ్గుతోందని ఆయన వివరించారు. కార్మికులను ఒక విభాగం నుంచి వేరొక విభాగంలోనికి మార్చిన సందర్భంలో పని భద్రతపై తగిన అవగాహనను కలిగించవలసిన యాజమాన్యం దాన్ని విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గడం వల్ల ఎస్ఎంఎస్ లో కార్మికుల మృతికి కారణమని ఆయన వివరించారు. డిప్లయ్మెంట్ చేస్తున్న కార్మికులకు కనీస భద్రత కల్పించే విధంగా మా యాజమాన్యాన్ని మీరు ఆదేశించాలని ఆయన్ని కోరారు.
దీనికి స్పందించిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న మూడు రోజులు మేము కర్మాగారంలో భద్రతపై పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఆ సమయంలో మీరు ఈ విషయాలను మా దృష్టికి తీసుకురావాలని వాటిని మా అధికారులు నోట్ చేసుకునే విధంగా మీరు వివరించండి అని ఆయన అన్నారు. సందర్శన సమయంలో మీరు చెప్పే భద్రతా లోపాలను మరియు మీరు మా దృష్టికి తీసుకువచ్చిన లోపాలను సమన్వయపరిచి మీ యాజమాన్యానికి తగిన సూచనలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, బి ఎన్ మధుసూదన్, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, వి ప్రసాద్, ఎం.వి రమణ, వి డి వి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.