Tuesday, 24 March 2026
  • Home  
  • భరత్‌ రామ్‌ అసత్య ప్రచారం చేస్తున్నాడు, చర్యలు తీసుకోండి.
- తూర్పు గోదావరి

భరత్‌ రామ్‌ అసత్య ప్రచారం చేస్తున్నాడు, చర్యలు తీసుకోండి.

– త్రీ టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎస్సీ సెల్‌, లీగల్‌ సెల్‌ సభ్యులు. రాజమహేంద్రవరం : రాజ్యాంగబద్దంగా ప్రజలచే అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యులు, లీగల్‌ సెల్‌ విభాగం మరియు వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మీద మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్‌ రామ్‌ సదరు ఆరోపణలను వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుకుని స్టైల్‌ గా కళ్ళజోడు పెట్టుకుని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభాండాలు వేసిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సమాధానం చెప్తూ జగన్‌ పెగ్గు పోశారని ఒప్పుకుంటే బాలయ్యబాబు మద్యం వేసించారని తాము ఒప్పుకుంటామని మాత్రమే సమాధానం చెప్పారని, అయితే జగన్‌ పోసాడా అనే మాటలను కట్‌ చేసి తాగి వచ్చారు అనే మాటలతో సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలుసార్లు ఈవిఎం ఎమ్మెల్యే అని మాటిమాటికి అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఆయన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఎన్నికల సంఘం ద్వారానే శాసన సభ్యులు కానీ, పార్లమెంట్‌ సభ్యులు గాని ఎన్నుకోబడుతున్నారని, అటువంటి వ్యవస్థను కూడా అపఖ్యాతి పాలు చేస్తూ ఎన్నికల సంఘం వ్యవస్థను కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అప్రతిష్ట పాలు చేసి రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలని పంపిస్తున్నారని మండిమడ్డారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అధికారిక, వ్యక్తిగత పని మీద ఢల్లీి వెళితే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికారులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఇటువంటి నిందారోపణలు చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మీద కూడా భరత్‌ రామ్‌ తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర, రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టే ధోరణిలో భరత్‌ రామ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలు, వ్యక్తులపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న మాజీ ఎంపీ భరత్‌ రామ్‌ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూరా రమణ, ఉడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవి కుమార్‌, కార్యదర్శులు కొమరం సురేష్‌, పెద్ద, వివిధ డివిజన్‌ ఇన్‌ఛార్జలు దుత్తరపు గంగాధర్‌, కానేటి ప్రభుదాస్‌, లీగల్‌ సెల్‌ నగర అధ్యక్షులు కొమ్మర్తి బాబ్జి, లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పూడి నవీన్‌, సభ్యులు సీహెచ్‌జి కిషోర్‌, ఈ సత్యం, నాయకులు కవులూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

– త్రీ టౌన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎస్సీ సెల్‌, లీగల్‌ సెల్‌ సభ్యులు.

రాజమహేంద్రవరం :

రాజ్యాంగబద్దంగా ప్రజలచే అత్యధిక మెజార్టీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ కమిటీ సభ్యులు, లీగల్‌ సెల్‌ విభాగం మరియు వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చాపల చిన్నరాజు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మీద మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్‌ రామ్‌ సదరు ఆరోపణలను వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ విగ్గు పెట్టుకుని స్టైల్‌ గా కళ్ళజోడు పెట్టుకుని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభాండాలు వేసిన నేపధ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ సమాధానం చెప్తూ జగన్‌ పెగ్గు పోశారని ఒప్పుకుంటే బాలయ్యబాబు మద్యం వేసించారని తాము ఒప్పుకుంటామని మాత్రమే సమాధానం చెప్పారని, అయితే జగన్‌ పోసాడా అనే మాటలను కట్‌ చేసి తాగి వచ్చారు అనే మాటలతో సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా పలుసార్లు ఈవిఎం ఎమ్మెల్యే అని మాటిమాటికి అదే పదాన్ని ఉచ్చరిస్తూ ఆయన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఎన్నికల సంఘం ద్వారానే శాసన సభ్యులు కానీ, పార్లమెంట్‌ సభ్యులు గాని ఎన్నుకోబడుతున్నారని, అటువంటి వ్యవస్థను కూడా అపఖ్యాతి పాలు చేస్తూ ఎన్నికల సంఘం వ్యవస్థను కూడా మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అప్రతిష్ట పాలు చేసి రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలని పంపిస్తున్నారని మండిమడ్డారు.

అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అధికారిక, వ్యక్తిగత పని మీద ఢల్లీి వెళితే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికారులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఇటువంటి నిందారోపణలు చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా మీద కూడా భరత్‌ రామ్‌ తప్పుడు ప్రచారం చేస్తూ కేంద్ర, రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రెచ్చగొట్టే ధోరణిలో భరత్‌ రామ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థలు, వ్యక్తులపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న మాజీ ఎంపీ భరత్‌ రామ్‌ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నగర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బూరా రమణ, ఉడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవి కుమార్‌, కార్యదర్శులు కొమరం సురేష్‌, పెద్ద, వివిధ డివిజన్‌ ఇన్‌ఛార్జలు దుత్తరపు గంగాధర్‌, కానేటి ప్రభుదాస్‌, లీగల్‌ సెల్‌ నగర అధ్యక్షులు కొమ్మర్తి బాబ్జి, లీగల్‌ సెల్‌ ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పూడి నవీన్‌, సభ్యులు సీహెచ్‌జి కిషోర్‌, ఈ సత్యం, నాయకులు కవులూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.