నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామ స్టాయి వరకు, అధికారులు సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినందున,ఈ ప్రాంతంలోని మారుమూల గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బంది, క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామ స్థాయి వరకు అధికారులు సిబ్బంది వారి కార్య స్థానాల్లో ఉండాలన్న : కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మోంథా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామ స్టాయి వరకు, అధికారులు సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినందున,ఈ ప్రాంతంలోని మారుమూల గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని, క్షేత్రస్థాయి సిబ్బంది, క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

