విశాఖపట్నం, అక్టోబర్ 28:
మొంథా తుఫాన్ కారణంగా విశాఖ నగరంలోని 51వ వార్డు పరిధిలోని వాంబే కాలనీలో కురిసిన భారీ వర్షాల వలన ఓ భవనం పెచ్చులు కూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ సందర్భంగా బాధిత ప్రాంతాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హరేంద్ర ప్రసాద్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణు కుమార్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మరియు 51వ వార్డు కార్పొరేటర్ రయ్యి వెంకటరమణ సందర్శించి ప్రజలను పరామర్శించారు.
కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను వెంటనే పంపించి, భవనం పరిస్థితిపై ఎస్టిమేషన్ చేయించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మాధురి, డిప్యూటీ తహసీల్దార్ సువర్ణ, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కోమలి, విఆర్వోలు, పోలీస్ శాఖ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు రామారావు, ఎర్నిబాబు, సింహాచలం, సంతోష్, అప్పారావు, సంబంధిత సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


