పున్నమి ప్రతినిది అక్టోబర్
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మురళీనగర్‌లోని ఉమా రమలింగేశ్వర ఆలయంలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము భక్తిశ్రద్ధలతో పరమశివునికి అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, 50వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ జోనల్ కమిషనర్‌ను ఘనంగా సత్కరించాడు.
ఈ కార్యక్రమంలో మురళీనగర్ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొని శివనామస్మరణతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ వేడుకను భక్తులు ఆనందంగా వీక్షించారు.


