Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం!
- విశాఖపట్నం

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం!

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు… * ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం! * వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ… * హాజరైన సౌత్ ఇన్చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు అని, వాటిని పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ ఎమ్మెల్యే సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ ఆధ్వర్యంలో 34 వార్డులో ఆదివారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుపల్లి హాజరై కరపత్రాలు అందజేసి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు 45 రోజులు పాటు కోటి సంతకాల సేకరణ విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు ఈ ఉద్యమం జోరుగా కొనసాగుతుందన్నారు. ఈ సేకరణ లో నలుగు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో భాగస్వాముల అవ్వాలని కోరారు. విద్యార్థి విభాగం వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు గరికన వెంకటేష్ చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు సీనియర్ నాయకులు లండ రమణ, లింగం శ్రీను, దూడ అప్పారావు, కారి దానియమ్మ, సిహెచ్. జ్యోతి, పిల్లి సత్తిబాబు, గాలి పార్వతి, కేబుల్ చిన్న, నర్సింగరావు, దుర్గారావు, యు. రాజేష్, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ప్రజల సొత్తు…

* ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం!

* వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ…

* హాజరైన సౌత్ ఇన్చార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు అని, వాటిని పిపిపి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ ఎమ్మెల్యే సౌత్ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ ఆధ్వర్యంలో 34 వార్డులో ఆదివారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాసుపల్లి హాజరై కరపత్రాలు అందజేసి ప్రజల నుండి సంతకాలు సేకరించారు. రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు 45 రోజులు పాటు కోటి సంతకాల సేకరణ విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు ఈ ఉద్యమం జోరుగా కొనసాగుతుందన్నారు. ఈ సేకరణ లో నలుగు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలతోపాటు విద్యార్థులు అధిక సంఖ్యలో భాగస్వాముల అవ్వాలని కోరారు. విద్యార్థి విభాగం వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు గరికన వెంకటేష్ చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు సీనియర్ నాయకులు లండ రమణ, లింగం శ్రీను, దూడ అప్పారావు, కారి దానియమ్మ, సిహెచ్. జ్యోతి, పిల్లి సత్తిబాబు, గాలి పార్వతి, కేబుల్ చిన్న, నర్సింగరావు, దుర్గారావు, యు. రాజేష్,
దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.