జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన యలగాల వెంకట నరసమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తమ సిఫార్సు లేఖ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) నుండి ఆర్థిక సహాయం అందించవల సిందిగా విజ్ఞప్తి చేశారు.
దాంతో ప్రభుత్వం నుండి ₹2,00,000 రూపాయల L.O.C (Letter of Credit) మంజూరైంది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా తమ నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పింగళ రామకృష్ణారెడ్డి, కామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతారెడ్డి వెంకట నర్సిరెడ్డి, గొర్రెపాటి సుబ్బారావు, పులగంరాంబాబు, గోళ్ళ నాగరాజు, కనపర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన యలగాల వెంకట నరసమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తమ సిఫార్సు లేఖ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) నుండి ఆర్థిక సహాయం అందించవల సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో ప్రభుత్వం నుండి ₹2,00,000 రూపాయల L.O.C (Letter of Credit) మంజూరైంది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే స్వయంగా తమ నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పింగళ రామకృష్ణారెడ్డి, కామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతారెడ్డి వెంకట నర్సిరెడ్డి, గొర్రెపాటి సుబ్బారావు, పులగంరాంబాబు, గోళ్ళ నాగరాజు, కనపర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

