ఇప్పగూడెం
*ఆసియన్ యూత్ గేమ్స్ లో మెరిసిన ఇప్పగూడెం యువకుడు…*
బహరెన్ లోని మనామా లో జరుగుతున్న 3వ ఆసియన్ యూత్ గేమ్స్ లో ఇప్పగూడెం గ్రామానికి చెందిన లోడెంగ రాము సత్తా చాటాడు…
భారత్ తరపున 400మీటర్ల పరుగు విభాగంలో రాము బరిలోకి దిగారు… పోటీల్లో భాగంగా నిర్వహించిన హీట్స్ దశలో 49.62 సెకన్ల రికార్డ్ వేగంతో మూడవ స్థానంలో నిలిచి ఫైనల్స్ అర్హత సాధించాడు…
నిరుపేద కుటుంబంలో జన్మించిన రాము చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు.. అయినా మొక్కవోని దీక్షతో అటు చదువులో.. ఇటు క్రీడల్లో రాణిస్తున్నాడు.. కోచ్ రాజేష్ శిక్షణలో ఇప్పటికే రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన రాము ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు… విదేశీ గడ్డపై కూడా తన ప్రతిభతో సత్తా చాటుతున్న రాము దేశానికి కచ్చితంగా పతకం తేవాలని కోరుకుంటున్నామని ఇప్పగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు…


