వెల్దండ అక్టోబర్ 22,
:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 న రాష్ట్ర కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది రెండు వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈనెల 17 న ప్రభుత్వం నిర్ణయించిన గడువు తెలిసిందే. సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఈనెల 23 న జరగనున్న కేబినెట్ మీటింగ్ కీలకమైనది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 జెడ్పిటిసి, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 1 జడ్పిటిసి స్థానం, 32 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఎంపీటీసీ ,జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు గుసగుసలు కార్యకర్తలలో మొదలయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులలో మళ్ళీ ఉత్కంఠ..!
వెల్దండ అక్టోబర్ 22, :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 న రాష్ట్ర కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్ళీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనేది రెండు వారాల్లో చెప్తామని హైకోర్టుకు ఈనెల 17 న ప్రభుత్వం నిర్ణయించిన గడువు తెలిసిందే. సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఈనెల 23 న జరగనున్న కేబినెట్ మీటింగ్ కీలకమైనది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 20 జెడ్పిటిసి, 214 ఎంపీటీసీ, 460 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, 1 జడ్పిటిసి స్థానం, 32 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఎంపీటీసీ ,జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు గుసగుసలు కార్యకర్తలలో మొదలయ్యాయి.

