Thursday, 12 February 2026
  • Home  
  • స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు
- జనగాం

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు

*హన్మకొండ* *తేదీ:20.10.2025* *దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……* దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని పేర్కొన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయ‌డం కూడా దీపావళి పండగ యొక్క విశిష్టత అని తెలిపారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు. మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందని వెల్లడించారు. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకాంక్షించారు. పటాకులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా, అనందంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

*హన్మకొండ*

*తేదీ:20.10.2025*

*దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి……*

దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని అన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని పేర్కొన్నారు. సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని ఆరాధించడం, కేదారీశ్వర వ్రతాలు చేయ‌డం కూడా దీపావళి పండగ యొక్క విశిష్టత అని తెలిపారు.

జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని అన్నారు. మనలో అంతర్జ్యోతి వెలిగినప్పుడే జీవితం పట్ల స్పష్టత ఏర్పడి ప్రతి రోజు పండుగలా ఆవిష్కృతమవుతుందని వెల్లడించారు. మనం పయినించే ప్రగతి పథంలో అడుగడుగనా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఆకాంక్షించారు. పటాకులు కాల్చే సమయంలో పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా, అనందంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.