విశాఖపట్నం, అక్టోబర్ 19:
శనివారం 90వ వార్డ్ బుచ్చిరాజుపాలెం ఎస్సీ కాలనీ నివాసులు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ ని కలసి విన్నవించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు సూచనల మేరకు కార్పొరేటర్ బొమ్మిడి రమణ వెంటనే జీవీఎంసీ నిధులతో బోరుబావి మంజూరు చేయించి శంకుస్థాపన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వాటర్ సప్లై డిఇ వీరయ్య, ఏఇ, గోవింద్, సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బొత్స రాజు పాల్గొన్నారు. స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.
—
కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ రమణ స్పందన
విశాఖపట్నం:
APSEB కాలనీ, సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఏడాకుల చెట్ల నుంచి వచ్చే గాలి ప్రమాదకరమని కాలనీ వాసులు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కి విన్నవించగా, ఆయన వెంటనే స్పందించి ఎమ్మెల్యే గణబాబు సూచనలతో ఆర్టీకల్చర్ శాఖ అధికారులతో మాట్లాడి ప్రమాదకరమైన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొని కార్పొరేటర్ తక్షణ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.


