విశాఖపట్నం, గాజువాక – పున్నమి ప్రతినిధి
గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించిన గూగుల్ విజయోత్సవ కార్యక్రమం ఘనవిజయవంతంగా జరిగింది. పాత గాజువాక జంక్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ విజయాన్ని ప్రజలతో పంచుకున్న నాయకులకు పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అయితే పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ గైర్హాజరైన కొంతమంది నేతల నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పార్టీ శాసనాలను పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


