Thursday, 12 February 2026
  • Home  
  • NSS స్పెషల్ క్యాంప్ పోస్టర్స్ విడుదల
- నిర్మల్

NSS స్పెషల్ క్యాంప్ పోస్టర్స్ విడుదల

ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భైంసాలో NSS యూనిట్ – 1 ఆధ్వర్యంలో నిర్వహించబోయే NSS ప్రత్యేక శిబిరం (Special Camp) కు సంబంధించిన పోస్టర్స్‌ను ఘనంగా విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య గారు NSS చైర్మన్ హోదాలో హాజరై పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – “NSS ద్వారా విద్యార్థులు సమాజానికి సేవ చేయడం నేర్చుకుంటారు. ప్రత్యేక శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ రాజు గారు మాట్లాడుతూ – “ప్రతి సంవత్సరం NSS ప్రత్యేక శిబిరాల ద్వారా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు” అని తెలిపారు. NSS వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని, రాబోయే ప్రత్యేక శిబిరంలో సమాజ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్, అధ్యాపకులు, రవికుమార్ డాక్టర్ శంకర్ డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్యార్థులు మరియు NSS వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ స్పెషల్ క్యాంప్ తేదీ 25.10.2025 నుంచి 31.10.2025, స్థలం: వాటోలి గ్రామం మండల్ భైంసా,

ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భైంసాలో NSS యూనిట్ – 1 ఆధ్వర్యంలో నిర్వహించబోయే NSS ప్రత్యేక శిబిరం (Special Camp) కు సంబంధించిన పోస్టర్స్‌ను ఘనంగా విడుదల చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య గారు NSS చైర్మన్ హోదాలో హాజరై పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – “NSS ద్వారా విద్యార్థులు సమాజానికి సేవ చేయడం నేర్చుకుంటారు. ప్రత్యేక శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ రాజు గారు మాట్లాడుతూ – “ప్రతి సంవత్సరం NSS ప్రత్యేక శిబిరాల ద్వారా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు” అని తెలిపారు.

NSS వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని, రాబోయే ప్రత్యేక శిబిరంలో సమాజ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్, అధ్యాపకులు, రవికుమార్ డాక్టర్ శంకర్ డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్యార్థులు మరియు NSS వాలంటీర్లు పాల్గొన్నారు.
ఈ స్పెషల్ క్యాంప్ తేదీ 25.10.2025 నుంచి 31.10.2025, స్థలం: వాటోలి గ్రామం మండల్ భైంసా,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.