Thursday, 26 March 2026
  • Home  
  • మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఘనస్వాగతం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
- విశాఖపట్నం

మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఘనస్వాగతం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

మహిళా ప్రపంచకప్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన భారత–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, గ్రౌండ్‌లో మిథాలీ రాజ్ పేరు, రావి కల్పనా పేరుతో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, గేట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్చం అందించి వారిని ఘనంగా ఆహ్వానించారు. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు వివరించారు. తర్వాత మంత్రి, ఐసీసీ ఛైర్మన్, ఏసీఏ అధ్యక్షుడు తదితరులు కలిసి భారత్–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ కార్యక్రమంలో దండమూడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బి. విజయ్ కుమార్, కౌన్సిలర్ దంతు గౌర్ విష్ణు తేజ్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి. చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు.

మహిళా ప్రపంచకప్ మ్యాచ్‌లలో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన భారత–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, గ్రౌండ్‌లో మిథాలీ రాజ్ పేరు, రావి కల్పనా పేరుతో ఏర్పాటు చేసిన గ్యాలరీలు, గేట్లను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్చం అందించి వారిని ఘనంగా ఆహ్వానించారు.

ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం, స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు వివరించారు.

తర్వాత మంత్రి, ఐసీసీ ఛైర్మన్, ఏసీఏ అధ్యక్షుడు తదితరులు కలిసి భారత్–ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు.

ఈ కార్యక్రమంలో దండమూడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బి. విజయ్ కుమార్, కౌన్సిలర్ దంతు గౌర్ విష్ణు తేజ్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతినిధి వి. చాముండేశ్వరనాథ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.