Thursday, 12 February 2026
  • Home  
  • *గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం*
- E-పేపర్

*గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం*

(అక్టోబర్ 6) గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా, గన్నవరం జాతీయ రహదారిపై, రావ్ ఫిన్ రియల్ ఎస్టేట్ మెయిన్ గేట్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో నాయుడుపేట ఏరియా నుండి విజయవాడ వైపు ధాన్యం లోడుతో వస్తున్న ఏపీ 16 టి యు 9946 నెంబర్ గల లారీకి వెనుక టైరు పంచర్ అవ్వడంతో లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయానికి ద్రాక్షారామం ఏరియా నుండి విజయవాడ వైపు భవాని దీక్ష పరులు ప్రయాణించే ఏపీ 31 టిహెచ్ 8348 నెంబర్ గల మినీ బస్సు పంచర్ పడి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనక నిలబడి వచ్చే వాహనాలకు లైట్ చూపిస్తూ సిగ్నల్ ఇస్తున్న లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా మినీ బస్సులో ఉన్న భవాని దీక్ష పరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద పరిస్థితిని నియంత్రించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(అక్టోబర్ 6) గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్

కృష్ణాజిల్లా, గన్నవరం జాతీయ రహదారిపై, రావ్ ఫిన్ రియల్ ఎస్టేట్ మెయిన్ గేట్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది.

సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో నాయుడుపేట ఏరియా నుండి విజయవాడ వైపు ధాన్యం లోడుతో వస్తున్న ఏపీ 16 టి యు 9946 నెంబర్ గల లారీకి వెనుక టైరు పంచర్ అవ్వడంతో లారీ డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపారు.

అదే సమయానికి ద్రాక్షారామం ఏరియా నుండి విజయవాడ వైపు భవాని దీక్ష పరులు ప్రయాణించే ఏపీ 31 టిహెచ్ 8348 నెంబర్ గల మినీ బస్సు పంచర్ పడి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో లారీ వెనక నిలబడి వచ్చే వాహనాలకు లైట్ చూపిస్తూ సిగ్నల్ ఇస్తున్న లారీ క్లీనర్ కు గాయాలయ్యాయి. అదేవిధంగా మినీ బస్సులో ఉన్న భవాని దీక్ష పరులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాద పరిస్థితిని నియంత్రించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.