Thursday, 12 February 2026
  • Home  
  • _*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం

_*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం*_ పొదలకూరు పున్నమి ప్రతినిధి : రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశీస్సులతో వారి అనుచురులు పొదలకూరు నరసారెడ్డి కాలనీలో వెన్నెముక, న్యూరో సమస్య గత ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన కూచిపాటి. వరప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ 50,000/- ఆర్థిక సాయం అందించారు. గురువారం పొదలకూరులోని వరప్రసాద్ నివాసానికి విచ్చేసిన నెల్లూరు హరినాధపురం ఫోర్త్ లైన్ కి చెందిన వినాయక ఉత్సవ కమిటీ నిర్వహకులు, వేమిరెడ్డి దంపతుల అనుచరులైన డేవిడ్ జాన్, మౌళి, రాజేష్ రెడ్డి, శ్యామ్, పవన్ అనే ఐదుగురు యువ నాయకులు రూ 50 వేల నగదును వరప్రసాద్ భార్య రేవతికి అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు .అలాగే వర ప్రసాద్ కి 90% అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వం అందించే రూ 15 వేల రూపాయల పెన్షన్ కూడా అందేలాగా చూస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. విజయదశమి పర్వదినాన గోమసాని వేణు ద్వారా తాము ఈ సమాచారం తెలుసుకుని వచ్చామని,ఆర్థిక సాయం తో ఒక మంచి పని చేసిన సంతృప్తి తమకు కలిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరస్తు షాపింగ్ మాల్ అధినేత గోమసాని వేణు, స్థానికులు పాల్గొన్నారు

_*వరప్రసాద్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం*_

పొదలకూరు పున్నమి ప్రతినిధి : రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశీస్సులతో వారి అనుచురులు పొదలకూరు నరసారెడ్డి కాలనీలో వెన్నెముక, న్యూరో సమస్య గత ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన కూచిపాటి. వరప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ 50,000/- ఆర్థిక సాయం అందించారు. గురువారం పొదలకూరులోని వరప్రసాద్ నివాసానికి విచ్చేసిన నెల్లూరు హరినాధపురం ఫోర్త్ లైన్ కి చెందిన వినాయక ఉత్సవ కమిటీ నిర్వహకులు, వేమిరెడ్డి దంపతుల అనుచరులైన డేవిడ్ జాన్, మౌళి, రాజేష్ రెడ్డి, శ్యామ్, పవన్ అనే ఐదుగురు యువ నాయకులు రూ 50 వేల నగదును వరప్రసాద్ భార్య రేవతికి అందజేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు .అలాగే వర ప్రసాద్ కి 90% అంగవైకల్యం కలిగిన వారికి ప్రభుత్వం అందించే రూ 15 వేల రూపాయల పెన్షన్ కూడా అందేలాగా చూస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. విజయదశమి పర్వదినాన గోమసాని వేణు ద్వారా తాము ఈ సమాచారం తెలుసుకుని వచ్చామని,ఆర్థిక సాయం తో ఒక మంచి పని చేసిన సంతృప్తి తమకు కలిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరస్తు షాపింగ్ మాల్ అధినేత గోమసాని వేణు, స్థానికులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.