Sunday, 29 March 2026
  • Home  
  • రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన బలోపేతమే లక్ష్యం
- అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన బలోపేతమే లక్ష్యం

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) రైల్వే కోడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే ప్రతి కార్యకర్త ధ్యేయంగా తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఇటీవల జనసేనలో చేరిన రాజుకుంట యువ నాయకులు ఆనాల సునీల్‌కుమార్, మాదినేని కనకరాజ, మాదినేని లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జనసేన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్ర మాట్లాడుతూ “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నీతి, నిజాయితీ, ప్రజా ఆమోదం మేరకు పాలన సాగించాలంటే గ్రామ స్థాయి వరకు పార్టీని బలపరచడం అత్యవసరం. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ ఏజెంట్ నిలబడే స్థాయికి చేరుకోవాలి. ముఖ్యంగా చిట్వేలి మండలం, రైల్వే కోడూరు ప్రాంతంలో జనసేన తిరుగులేని శక్తిగా నిలవాలి. ఈ లక్ష్యం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.అలాగే పార్టీలో చేరిన సునీల్, కనకరాజ, లోకేష్ మాట్లాడుతూ“జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం, కార్యకర్తల సహకారంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, ఏనుగుల జగన్మోహన్ రాయల్, పగడాల శివ, శివరాం, తేజ, పగడాల వెంకటేష్, సాదు కిషోర్‌తో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

చిట్వేలి, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)

రైల్వే కోడూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే ప్రతి కార్యకర్త ధ్యేయంగా తీసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఇటీవల జనసేనలో చేరిన రాజుకుంట యువ నాయకులు ఆనాల సునీల్‌కుమార్, మాదినేని కనకరాజ, మాదినేని లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జనసేన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్ర మాట్లాడుతూ “జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న నీతి, నిజాయితీ, ప్రజా ఆమోదం మేరకు పాలన సాగించాలంటే గ్రామ స్థాయి వరకు పార్టీని బలపరచడం అత్యవసరం. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ ఏజెంట్ నిలబడే స్థాయికి చేరుకోవాలి. ముఖ్యంగా చిట్వేలి మండలం, రైల్వే కోడూరు ప్రాంతంలో జనసేన తిరుగులేని శక్తిగా నిలవాలి. ఈ లక్ష్యం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.అలాగే పార్టీలో చేరిన సునీల్, కనకరాజ, లోకేష్ మాట్లాడుతూ“జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం, కార్యకర్తల సహకారంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, ఏనుగుల జగన్మోహన్ రాయల్, పగడాల శివ, శివరాం, తేజ, పగడాల వెంకటేష్, సాదు కిషోర్‌తో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.