Monday, 23 March 2026
  • Home  
  • ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు!
- జాతీయ అంతర్జాతీయ

ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు!

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) గుడ్‌ న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు! వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపెనీకి మార్చుకోవడానికి అనుమతించే “LPG ఇంటర్‌ఆపరబిలిటీ”పై పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిపై వినియోగదారులు, పంపిణీదారుల నుండి సూచనలు కోరింది. 2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం, అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)

గుడ్‌ న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను సిమ్‌లాగా పోర్ట్ చేసుకోవచ్చు!
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ తరహాలో త్వరలో LPG కనెక్షన్లను కూడా మరో కంపెనీకి మార్చుకోవడానికి అనుమతించే “LPG ఇంటర్‌ఆపరబిలిటీ”పై పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు (PNGRB) ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిపై వినియోగదారులు, పంపిణీదారుల నుండి సూచనలు కోరింది. 2013లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం, అప్పట్లో డీలర్‌ను మార్చుకునే పరిమిత అవకాశాలను ఇచ్చింది. ఇప్పుడు కంపెనీల మధ్య పోర్టబిలిటీని పరిశీలిస్తోంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.