కామారెడ్డి, 29 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి. :
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి లక్ష్మా గౌడ్ నివాసం లో సోమవారం నాడు కీలకమైన సమీక్ష సమావే శం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై, పార్టీ బలోపేతంపై చర్చించా రు. ఈ సందర్భంగా, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, కలసికట్టు గా పనిచేయాలని ఉద్ఘాటించారు. “వార్డు మెంబర్ నుండి జెడ్పిటిసి వరకు ప్రతిచోటా కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపు నిచ్చారు. అంతకుముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్న సమయంలోనూ, రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ వీర సైనికుల, అభిమానుల సహకారంతోనే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్టీ జెండాను ఎగరేయగలిగానని గుర్తుచేశారు. ఈ ఘనత కాంగ్రెస్ వీర సైనికులదనే ఆయన అదే పట్టుదల, ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


