నల్లజర్ల మండలం సెప్టెంబర్ ( పున్నమిప్రతినిధి )
రాజమండ్రిలో One Election – One Nation కార్యక్రమానికి గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు హాజరయ్యారు. ముఖ్య అతిథులు న్యూ ఢిల్లీ ఎంపీ కుమారీ బాన్సూరీ స్వరాజ్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి (అధ్యక్షత), రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మద్దిపాటి వెంకట రాజు, దేశ ప్రజల ఆలోచనలను గౌరవిస్తూ, సంస్కరణలను అట్టడుగు స్థాయిలో అందించడం ప్రధాన లక్ష్యం అని తెలిపారు. వన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గి దేశవృద్ధికి సహాయపడతుందని, జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు లబ్ధి అందుతుందని అభినందించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు.


