



నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుల ఆధ్వర్యంలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ముగింపు ఉత్సవంలో భాగంగా సత్సంగం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమ్మానాయుడు గారు, ఎంపీటీసీ కింజరాపు సూర్యనారాయణ గారు, మాజీ ఎంపీటీసీ సింహాచలం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ సురేంద్ర గారు, డిల్లేశ్వరరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ – “ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో అందరూ, ముఖ్యంగా మహిళలు కూడా హ్యాపీనెస్ ప్రోగ్రామ్ చేయాలి. యోగా అనేది కనిపించే శరీరానికే కాకుండా, కనిపించని మనసు, బుద్ధి, ఆత్మ, చిత్తం వంటి వాటికీ ఉపయోగపడుతుంది” అని తెలిపారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురువుగారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు.కార్యక్రమంలో యారబాడు గ్రామ ప్రజలు, నరసన్నపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారికి అల్పాహారం పంపిణీ చేయబడింది. అలాగే స్టేట్ లెవల్ యోగా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన యోగా సుప్రజకు ఆమె గురువుగారు రవి సదాశివుని సమక్షంలో ఘన సన్మానం నిర్వహించారు.

