Sep 20, పున్నమి ప్రతినిధి, జనగాం:
జడ్‌పిహెచ్‌ఎస్ ఏడునూతులలో బతుకమ్మ, దసరా పండుగలను విద్యార్థులు ఆనందోత్సాహాలతో, సంప్రదాయ శైలిలో ఘనంగా జరుపుకున్నారు. బాలికలు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను సృజనాత్మకంగా అలంకరించగా, విద్యార్థులందరూ పాటలు పాడుతూ చీరకట్టులో గుమ్మడిగా ఆడారు. అటు బాలురు రావణాసురుని విగ్రహాన్ని తయారు చేసి, దసరా పండుగలో ధర్మం అధర్మంపై సాధించిన విజయాన్ని ప్రతిబింబించారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలు, దసరా కథా రూపకాలు, వక్తృత్వం, కవితా పఠనం ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను చూసి అందరూ మెచ్చుకున్నారు.
ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య గారు మాట్లాడుతూ: “బతుకమ్మ పూల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తే, దసరా పండుగ సత్యం, న్యాయం, ధర్మం సాధించిన విజయాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను, సృజనాత్మకతను, ఐక్యతను పెంపొందిస్తాయి” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని విద్యార్థులను అభినందించారు.


