

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం జగన్నాధపురం వీధిలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ –”గణేష్ నవరాత్రులు సామాజిక ఐక్యత, సాత్వికతకు ప్రతీక. అన్నదానం అనేది అత్యున్నత దానం. ఈ విధమైన కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, సేవా భావాలను పెంపొందిస్తాయి. ఉత్సవాలను శాంతియుతంగా, సాంప్రదాయబద్ధంగా జరపడం ప్రతి ఒక్కరి బాధ్యత”, అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

