సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ఆంధ్రా అంబేద్కర్‌లా దళితులకు ఆలయ ప్రవేశాలు కల్పించిన సంఘ సంస్కర్త!
ఆంధ్రా గాంధీలా స్వాతంత్ర్య పోరాటం చేసిన యోధుడు!
మదరాసీల నుండి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారికి, 58 అడుగుల విగ్రహం, స్మారక కేంద్రం, స్మృతివనం కోసం…
ప్రజా రాజధాని అమరావతిలో, లోకేష్ వేసిన మొట్టమొదటి పునాది రాయి ఇది.
మన భావితరాలకు గుర్తుంచుకోవాల్సిన అమరజీవి విగ్రహానికి అంతర్జాతీయ స్థాయి అమరావతిలో సముచితమైన గౌరవం. ఇది ఆంధ్రులకు గర్వకారణం


