Friday, 15 May 2026
  • Home  
  • గాలి పాలెంలో భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాలి పాలెంలో భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవాలు

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని గాలి పాలెం గ్రామంలో భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆగస్టు 22వ తేదీ శుక్రవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.మొదటి రోజు శుక్రవారం శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీపాద చిన్న వెంకయ్యస్వామి వారిచే ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, మెలకోలుపు సేవలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 23న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి భజనోత్సవం కార్యక్రమాలు ఉన్నాయి. ఆగస్టు 24న ఆదివారం ఉదయం 8 గంటలకు బ్రాహ్మణక్రాక శ్రీహరి బృందం (జలదంకి, కావలి) వారిచే కోలాటభజన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్యస్వామి వారిచే అభిషేకం, పల్లకీసేవ నిర్వహించబడింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణం జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, తేరు ఉత్సవం భక్తుల సందడితో ఘనంగా నిర్వహించబడింది. రాత్రి 8 గంటలకు మరోసారి అన్నసంతర్పణం, అనంతరం నెల్లూరుకు చెందిన “శ్రీ కళాంజలి ఆర్కెస్ట్రా & ఈవెంట్స్” ఆధ్వర్యంలో సంగీత విభావరి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో యం.జి. దివ్య పావని (నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం) నాట్య ప్రదర్శనలు, అలాగే నెల్లూరు జాదూగర్ శ్రీనివాస్ గారి మ్యాజిక్ షో ప్రదర్శన ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు.

చేజర్ల ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని గాలి పాలెం గ్రామంలో భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి ఆరాధన మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆగస్టు 22వ తేదీ శుక్రవారం నుండి 24వ తేదీ ఆదివారం వరకు మూడు రోజులపాటు ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.మొదటి రోజు శుక్రవారం శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీపాద చిన్న వెంకయ్యస్వామి వారిచే ఆరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, మెలకోలుపు సేవలు నిర్వహిస్తున్నారు.

ఆగస్టు 23న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి భజనోత్సవం కార్యక్రమాలు ఉన్నాయి.

ఆగస్టు 24న ఆదివారం ఉదయం 8 గంటలకు బ్రాహ్మణక్రాక శ్రీహరి బృందం (జలదంకి, కావలి) వారిచే కోలాటభజన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు శ్రీశ్రీశ్రీ సద్గురు శ్రీహరి చిన్న వెంకయ్యస్వామి వారిచే అభిషేకం, పల్లకీసేవ నిర్వహించబడింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణం జరుగుతాయి.

సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం, తేరు ఉత్సవం భక్తుల సందడితో ఘనంగా నిర్వహించబడింది. రాత్రి 8 గంటలకు మరోసారి అన్నసంతర్పణం, అనంతరం నెల్లూరుకు చెందిన “శ్రీ కళాంజలి ఆర్కెస్ట్రా & ఈవెంట్స్” ఆధ్వర్యంలో సంగీత విభావరి క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో యం.జి. దివ్య పావని (నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం) నాట్య ప్రదర్శనలు, అలాగే నెల్లూరు జాదూగర్ శ్రీనివాస్ గారి మ్యాజిక్ షో ప్రదర్శన ఉంటుంది.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.