వింజమూరు ఆగస్టు14 : పున్నమి న్యూస్ ప్రతినిధి///
ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల కు సంబంధించిన 33 మంది బాధిత కుటుంబాలకు సుమారు 51 లక్ష 78 వేల 655 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో నియోజకవర్గంలోని నియోజకవర్గంలోని మండల నాయకులు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేశారు.గురువారం వింజమూరు లోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వింజమూరు మండలం శంకవరం గ్రామానికి చెందిన అలపాటి శ్రీలత గారికి సీఎం సహాయ నిధి నుండి 12 లక్షల 82, వేల120 రూపాయలు మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి , మరియు మండల పార్టీ నాయకులు, గ్రామపార్టీ అధ్యక్షులు భూమిరెడ్డి నరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందని వైద్యానికి బాధితులు, కార్పొరేట్ వైద్యశాలలలో వైద్యం అందించుకొని, అత్యధికంగా ఖర్చు చేసుకొని, చిన్న భిన్నం అవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు, సీఎం సహాయనిధి వారి కుటుంబాలకు భరోసాను కల్పిస్తుందని తెలిపారు. మునుపెన్నడు లేని విధంగా పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సుమారు రెండు కోట్ల రూపాయల సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ప్రజల ఆదరభిమానాలను సూరగుంటుంది అని తెలిపారు. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ పాగా వేసిందన్నారు. ఉదయగిరి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, దుత్తలూరు మండల కన్వీనర్, వెంకటరత్నం, సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, యారవ కిష్టయ్య నాయుడు,మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, పాములపాటి మాల్యాద్రి, మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసుల యాదవ్, చేబ్రోలు వసంతరావు, దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి, శనివరపు నాగిరెడ్డి, కటకం ప్రసన్నకుమార్ భూమి రెడ్డి నరసింహారెడ్డి, వెంకటరెడ్డి బాధిత కుటుంబాలు బాధితులు ఇతర నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు.


