Tuesday, 31 March 2026
  • Home  
  • ఉపాధ్యాయుడు రవిచందర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్.
- జోగులాంబ గద్వాల

ఉపాధ్యాయుడు రవిచందర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న, పి.రవిచందర్‌ను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాల సమయాల్లో మద్యం సేవించడం, విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలలో మద్యం సేవించడం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తమ విధులను నిర్వర్తించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

అలంపూర్ : ఆగస్టు 14 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న, పి.రవిచందర్‌ను జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాల సమయాల్లో మద్యం సేవించడం, విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలలో మద్యం సేవించడం విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉపాధ్యాయులు తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తమ విధులను నిర్వర్తించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.