పాఠశాల విద్యార్ధులకు
ప్లేట్లు,గ్లాసులు వితరణ.
ఆగిరిపల్లి మండలం,సర్నాల గూడెం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్ధులను విజయవాడ లోని వేద చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు ట్రస్టు ఛైర్పర్సన్ శ్రీమతి యడ్లపాటి శిరీష రాణి గారు,జనరల్ సెక్రటరీ శ్రీ యడ్లపాటి శేషసాయి గారలు దత్తత తీసుకుని విద్యార్ధులకు మద్యాన్న భోజనానికి అవసరమైన ప్లేట్లు,గ్లాసులు మరియు రెండవసారి విద్యార్ధులకు అవసరమైన నోటు పుస్తకాలు,పెన్నులు,పెన్సిల్లు, అరెజెర్స్ అందించడం జరిగినది. విద్యార్ధులు కూర్చోవడానికి అవసరమైన బెంచీలు కూడా తయారు చేస్తున్నాము అని అవి తయారు కాగానే పాఠశాలకు అందచేయగలమని తెలియజేసి ఉన్నారు.వారు చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్త పరిచారు.ఈ సందర్భంగా దాతలను విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి బీను,ప్రధానోపాధ్యాయులు J. జ్ఞాన సుందరం,ఉపాధ్యాయుని శ్రీమతి V. విజయ శ్రీ మరియు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.


