నంద్యాల లో ‘వార్ 2’ మూవీ విడుదల సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’ విడుదల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో అభిమానులు భారీగా సద్భావంతో సెలబ్రేషన్లు నిర్వహించారు.
అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ కటౌట్, నంద్యాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. అభిమానుల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. కటౌట్ పక్కన స్టేజీ ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ పాటలతో అభిమానులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ, ఫ్లెక్సీలు ఊపుతూ అభిమానులు తమ అభిమానాన్ని చాటారు.
ఈ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ‘వార్ 2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై భారీ హైప్ నెలకొంది.
జై ఎన్టీఆర్ అన్న నినాదాలతో నంద్యాల నగరం ఒక్కసారిగా వేడెక్కింది.


