Monday, 10 August 2026
  • Home  
  • 80,140 మంది ఓటర్లకు నోటీసులు.. 7 రోజుల తర్వాతే హియరింగ్: కలెక్టర్
- News

80,140 మంది ఓటర్లకు నోటీసులు.. 7 రోజుల తర్వాతే హియరింగ్: కలెక్టర్

నంద్యాల, ఆగస్టు 10: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026లో భాగంగా జిల్లాలో 80,140 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిన నేపథ్యంలో క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 14,05,443 మంది ఓటర్లలో 12,25,937 మందిని నిజమైన ఓటర్లుగా గుర్తించగా, 74,073 మందికి లాజికల్ డిస్క్రిపెన్సీలు, 6,067 మందికి మ్యాపింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీ నుంచి కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా హియరింగ్ తేదీ నిర్ణయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులు అందినట్లు ఆధారాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. SIR ప్రకారం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురించనున్నట్లు తెలిపారు.

నంద్యాల, ఆగస్టు 10: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026లో భాగంగా జిల్లాలో 80,140 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు.
జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిన నేపథ్యంలో క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. జిల్లాలో 14,05,443 మంది ఓటర్లలో 12,25,937 మందిని నిజమైన ఓటర్లుగా గుర్తించగా, 74,073 మందికి లాజికల్ డిస్క్రిపెన్సీలు, 6,067 మందికి మ్యాపింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
నోటీసు జారీ చేసిన తేదీ నుంచి కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా హియరింగ్ తేదీ నిర్ణయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులు అందినట్లు ఆధారాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. SIR ప్రకారం తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురించనున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.