శ్రీకాళహస్తి, జూన్ 11, (పున్నమి న్యూస్) : దేశ ప్రధానిగా 4400 రోజులు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మోడీ పేరిట రుద్రాభిషేకం, రాహుకేతు పూజలు నిర్వహించి, దేశ సేవలో ఆయనకు మరింత ఆయురారోగ్యాలు, శక్తి ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….జూన్ 10న మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 4398 రోజుల పదవీకాల రికార్డును అధిగమించిన మోడీ, నేటితో 4400 రోజుల పాలన పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ రంగాల్లో భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోడీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రజాసేవకు గుర్తింపుగా మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య, బాగీతి వెంకటేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

4400 రోజుల ప్రధాని మోడీ పాలనకు శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు