దక్షిణ నియోజకవర్గంలో జనసేన జోష్ కొనసాగుతోంది. 41వ వార్డు పరిధిలో నిర్వహించిన భారీ కార్యక్రమంలో యువనేత యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ తన అనుచరులు, యువత, మహిళలతో కలిసి ఎమ్మెల్యే, విశాఖ నగర జనసేన అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు.
ఈ సందర్భంగా నిఖిలేష్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే వంశీకృష్ణ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు తనను ఆకట్టుకుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, దక్షిణ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్నారు.
ఈ కార్యక్రమంలో POC పి.వి. శివప్రసాద్ రెడ్డి, వార్డు అధ్యక్షులు ఆంథోనీ శేఖర్, కూటమి నాయకులు సంజీవరావు, బానోజీరావు, రమణ, సునీత, ఉప్పులి రాజు, గణేష్, ఆశాజ్యోతి, అనిల్ కుమార్, కమల్ కుమార్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.


