శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర, దేశ రాజకీయాల్లోనే ఆదర్శంగా నిలిచాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బయ్య పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన “బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” హామీలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.63 వేల కోట్లను పేదలకు అందజేసినట్లు తెలిపారు. “తల్లికి వందనం” పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.10,090 కోట్ల ఆర్థిక సహాయం అందిందన్నారు. మహిళల కోసం ప్రారంభించిన “శక్తి” పథకం ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కోట్లాది ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని చెప్పారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు తెలిపారు. “అన్నదాత సుఖీభవ” ద్వారా 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా రూ.8,985 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. యువతకు 24 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక ఒప్పందాలు కుదిరాయని, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సుబ్బయ్య పేర్కొన్నారు. అన్నారు.

23 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్- టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య